మత్తయి 9:27లో ఇద్దరు గ్రుడ్డివారు ప్రభువైన యేసు యొద్దకు వచ్చారు. కాని వారిని స్వస్థపరచక ముందు, ఆయన వారినిట్లడిగి యున్నారు, మీ కొరకు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారు, అవును ప్రభువా, నమ్ముచున్నామని చెప్పారు. అప్పుడు ప్రభువైన యేసు మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుందని చెప్పారు (మత్తయి 9:29).
ఇది దేవుని నియమము. మన నమ్మిక చొప్పున మనం పొందుకుంటాము అంతకంటే ఎక్కువ కాదు లేక తక్కువకాదు. ఆ గ్రుడ్డివారికి అద్భుత మవసరమేనా? అవసరమే. ప్రభువు వారికి అద్భుతము చేయాలని కోరియున్నాడా? అవును కోరియున్నాడు. కాని వారికి ప్రభువులో విశ్వాసము లేనట్లయితే అద్భుతము జరుగదు. ఇప్పుడు దీనిని నీకు అన్వయించు కొనుము. దేవుడు నీ కొరకు అద్భుతము చేయాలని కోరుచున్నాడా? అవును. కోరుచున్నాడు. అయినప్పటికీ నీవు దేవునిలో విశ్వాసముంచ నట్లయితే, దానిని నీవు పొందక పోవచ్చును.
ఒకవేళ ఒక గ్రుడ్డివాడు ప్రభువుతో ఇట్లనిన యెడల, ప్రభువా నీవు ఒక కన్నును మాత్రమే నిశ్చయముగా తెరువగలవు. నిజానికి అదే నాకు ఎంతో ఎక్కువ, నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది. అతని యొక్క ఒక కన్ను మాత్రమే తెరువబడి యుండెడిది. ఒకవేళ రెండవవాడు ఇట్లనినట్లయితే, ప్రభువా, నీవు నా రెండు కళ్ళను స్వస్థపరచ గలవు. అతని విశ్వాసమును బట్టి అతని రెండు కళ్ళు తెరువబడి ఉండేవి.
ఒక కన్నును స్వస్థత పొందినవాడు, ప్రభువైన యేసు ఒక కన్నునే స్వస్థపరచ గలడనే ఒక కన్ను పరిచర్యను ఆరంభించేవాడు. రెండవవాడు, ప్రభువైన యేసు రెండు కళ్ళను స్వస్థపరచగలడనే రెండు కళ్ళ పరిచర్యను ఆరంభించేవాడు. అలాగే ఈనాడు కొందరు ప్రభువైన యేసు మన పాపములను క్షమించగలడని మాత్రమే సువార్త ప్రకటించుచున్నారు. కాని కొందరు, ప్రభువు మన పాపములను క్షమించుట మాత్రమే గాక, పాపము మీద జయమను గ్రహిస్తాడని ప్రకటించు చున్నారు. అప్పుడు మొదటివాడు ఇది అసాధ్యము. ప్రభువు ఒక్క కన్ను మాత్రమే స్వస్థపరచగలడు కాబట్టి రెండవవాడిని మతబ్రష్టుడు అని అంటాడు. ఎందుకనగా అతనిలో ఒక్కకన్ను స్వస్థతపొందే విశ్వాసమే ఉంది. రెండవ వానికి రెండు కళ్ళు స్వస్థతనిచ్చే విశ్వాసమున్నది. అతడు పాపక్షమాపణ కొరకు మాత్రమేకాక, జయము కొరకు కూడా విశ్వాసాన్ని కలిగి యున్నాడు.
ఈ రెండింటిలో నీవు ఏ గుంపులో ఉన్నావు? ప్రభువైన యేసు కేవలం నీ పాపాలను మాత్రమే క్షమించగలడని నీవు విశ్వసించినట్లయితే, నీవు పాపక్షమాపణ మాత్రమే పొందుతావు. కాని నీవు కోపము, మోహము, గర్వము, అసూయ మొదలగు వాటిలో ఓడిపోతూ ఉంటావు. కాని మరొక విశ్వాసి, రోమా 6:14 ప్రకారము "నేను కృపలో ఉన్నాను కాబట్టి పాపము నా మీద ప్రభుత్వము చేయదు" అని చెబుతాడు. కాబట్టి ఆ వచనము నాలో అనుభవమై నెరవేరుతుందని ప్రభువును నమ్ముచున్నానని' అంటాడు. ఇతడు రెండు కళ్ళను పొందుతాడు. అతనిని మత బ్రష్టుడని పిలువవద్దు. అతడు నీకంటే ఎక్కువగా ప్రభువులో నుండి పొందుకొని యున్నాడు. ఎందుకనగా అతడు నీ కంటే శ్రేష్టుడు కాబట్టి కాదు గాని అతడు నీ కంటే ఎక్కువగా ప్రభువులో విశ్వాసముంచి యున్నాడు.
రచయిత ✍️: జాక్ పూనెన్

0 కామెంట్‌లు