మూడు ఆత్మీయ వివాహములు

రోమా 7వ అధ్యాయములో పాపముమీద జయముపొంది, పరిశుద్ధముగా జీవించాలని కోరిన ఒక వ్యక్తి ఉన్నాడు కాని ఏవిధంగా జీవించగలడో తెలియదు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ వివాహాన్ని చూపిస్తున్నాడు (4వ వచనము). మనము రక్షణ పొందకముందు, ప్రాచీన పురుషునితో మనకు వివాహమైంది.
రక్షణ పొందిన తరువాత, క్రీస్తును పెళ్ళి చేసుకొని ఆయనతో ఏకాత్మయై యున్నామని ఎరుగక ధర్మశాస్త్రముతో పెళ్ళాడి పొరపాటు చేయుచున్నాము.

పాపము మీద జయము పొందగోరే ప్రతివిశ్వాసి ఈ పొరపాటును చేస్తాడు. ధర్మశాస్త్రాన్ని వివాహము చేసుకోవటమంటే తన స్వంత శక్తితో పాపము మీద జయము పొందుటకు ప్రయత్నించుట. 6 మరియు 7 అధ్యాయములలో మూడు ఆత్మీయ వివాహాలు చూస్తాము.
మొదటిగా ప్రాచీనపురుషునితో, తరువాత ధర్మశాస్త్రముతో, చివరకు క్రీస్తుతో వివాహమవుతుంది.

ప్రాచీన పురుషుడు (ప్రాచీన స్వభావము) చెడ్డ భర్తయై యుండి, భార్యను కొట్టి, హింసించి, ఆమెను వ్యభిచారిణిగా మార్చి మరియు ఆమెను, ఆమె సంతోషాన్ని నాశనము చేశాడు. ఈ భార్య తన దుష్టుడైన భర్త నుండి విడుదల పొందుటకు ఎంతో కోరుతూ ఉంటుంది. ఒక రోజు ప్రాచీనపురుషుడు చనిపోతాడు. ఆమె క్రొత్తగా జన్మిస్తుంది.

ఇప్పుడు మరలా వివాహము చేసుకొనుటకు విడుదల పొందియున్నది. కాని ఆమె క్రీస్తును వివాహము చేసుకొనుటకు బదులుగా క్రీస్తువలె ఉన్న ధర్మశాస్త్రాన్ని వివాహమాడుతుంది. ధర్మశాస్త్రము నీతిని కోరుతూ, పరిపూర్ణమైయుంది కాబట్టి క్రీస్తుకు బదులుగా ధర్మశాస్త్రాన్ని స్వీకరించే పొరపాటు చేయటం మనకు చాలా సులభము. ధర్మశాస్త్రము ప్రాచీనపురుషుని వంటిది కాదు. అతనివలె భార్యని హింసించదు లేక బాధపెట్టదు. కాని ధర్మశాస్త్రము పరిపూర్ణతను కోరుతుంది. ఉదయం 6 గంటలకే లేవాలని డిమాండ్‌ చేస్తుంది. 8 గంటలకు టిఫిన్‌ (అల్పాహారము) తయారు కావాలని డిమాండ్‌ చేస్తుంది. 8 గంటల ఒక నిమిషము(8:01) కూడా కాదు 8 గంటలకే. పరిపూర్ణత అంటే అదే.

ఇల్లంతయు పరిశుభ్రంగా ఉండాలి. చెప్పులు ఎల్లప్పుడు వాటి స్థానములో ఉండాలి. బట్టలు శుభ్రంగా ఉతికి, మంచిగా ఇస్త్రీ చేయాలి. చెడును చేయమని ధర్మశాస్త్రము చెప్పదు. ప్రతి విషయములోను పరిపూర్ణత కోరే ఇటువంటి భర్తను ఎంతమంది యౌవన స్త్రీలు వివాహము చేసుకొనుటకు ఇష్టపడతారు? ప్రాచీనపురుషుని విడచి ధర్మశాస్త్రాన్ని పెళ్లి చేసుకొన్నట్లయితే, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. అతడు మంచివాడే గాని ఎల్లప్పుడు డిమాండ్‌ చేస్తూ ఉంటాడు. అతడు చెడ్డదానిని కోరడుగాని నీవు అతని స్థాయిని ఎన్నటికి చేరుకోలేవు. అప్పుడు నీవు తప్పుడు వ్యక్తిని వివాహము చేసుకున్నావని గ్రహిస్తావు. కాబట్టి ఇప్పుడు ఏమి చేయగలవు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రమెన్నటికీ చనిపోదు. ఇక్కడ ఆరోగ్యముతో ఉన్న బలమైన, ఎల్లప్పుడూ నివసించే భర్తను చూస్తున్నాము.
భర్తగల స్త్రీ, అతడు బ్రతికియున్నంత వరకు అతనికే బద్దురాలు (రోమా 7:2). కాబట్టి ఆ స్త్రీ తాను ఎన్నటెన్నటికీ సంతోషించలేనని తెలుసుకుంటుంది.

అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చేశారు. ఆ స్త్రీని చనిపోయేటట్లు ఆయన చేసి, ఆ వివాహము నుండి విడుదల కలుగచేశాడు. మొదటి భర్తయైన ప్రాచీనపురుషుడు చనిపోయాడు. ఇప్పుడు భార్య అనగా నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయావు.
కాబట్టి నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి (రోమా 7:4).

ఇప్పుడు నీవు క్రీస్తుతో కూడా చనిపోయావు కాబట్టి ఇంక ఏమాత్రమును ధర్మశాస్త్రము క్రిందలేవు. మరియు దేవుడు నిన్ను క్రీస్తుతో కూడా లేపియున్నాడు కాబట్టి ఇప్పుడు నీవు క్రీస్తుని పెళ్ళి చేసుకోవచ్చును. ఇదియే మహిమకరమైన మూడవ వివాహము. అయితే క్రీస్తు పరిపూర్ణుడై యుండి, ఇట్లనును, ఉదయం 8 గంటలకు టిఫిన్‌ తయారు కావాలి, 8:01 గంటలకు కాదు, ప్రతీది కూడా సమయానికి జరగాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి మొదలైనవి.

ఇవి ధర్మశాస్త్రము కంటే తక్కువ డిమాండ్స్‌ కాదు, నిజానికి ఇంకా ఎక్కువే. నీవు వ్యభిచారము చేయవద్దని ధర్మశాస్త్రము చెపుతుంది. నీవు స్త్రీని మోహపు చూపుతో చూడొద్దని ప్రభువైన క్రీస్తు చెప్పుచున్నాడు. కాని ధర్మశాస్త్రానికి మరియు క్రీస్తుకూ చాలా తేడా ఉంది. క్రీస్తు ఇట్లనుచున్నాడు, మనమిద్దరము కలసి టిఫిన్‌ తయారు చేద్ద
క్రీస్తే మనలో జీవిస్తున్నాడు కాబట్టి సమస్తమును ఆయనతో కలసి చేస్తాము.

ఒకవేళ నీవు చాలా బలహీనురాలవైన భార్యవై యుండి, టిఫిన్‌ను మధ్యాహ్నం ఒంటిగంటకు తయారు చేశావనుకొనుము. ధర్మశాస్త్రమువలె ప్రభువు నిన్ను గద్దించడు లేక నిన్ను తృణీకరించడు. ఆయన ఇట్లంటాడు, పరవాలేదు, మనిద్దరము కలసి చేద్దాము మరియు నీవు కొంచెం నేర్చుకొని వృద్ధిని పొందుతావు. మరియు ప్రభువు నీలోను, నీతోను పనిచేస్తాడు మరియు కొద్దిరోజుల తరువాత ఉదయం 11 గంటలకు టిఫిన్‌ తయారుచేస్తావు. ప్రభువిట్లనును, అద్భుతం, మనమిప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట నుండి 11 గంటలకు చేసియున్నాము.

ఈ దినాలలో ఒకరోజు 8 గంటలకు తయారు చేస్తాము. పరిపూర్ణుల మగుటకు సాగిపోతూ ఉందాము. ఒకవేళ నీవు బట్టలు సరిగా ఉతకలేక, వాటి మీద మరకలున్నట్లయితే, ప్రభువు నీతో ఇట్లనును, ఫరవాలేదు బాధపడకు, ఆ విషయంలో కూడా ఇద్దరము కలసి పనిచేద్దాము. ఆయన సహాయంతో నీవు మరల బట్టలు ఉతికినప్పుడు, కొద్దిగా తక్కువ మరకలు ఉండును. మరకలన్నియు పోయేవరకు ప్రభువు నీలోను, నీతోను ఉండి పని చేయాలని తీర్మానించుకొని, నిర్ణయించుకున్నాడు. కాబట్టి నీవు సంపూర్ణుడవగు వరకు ప్రభువు నీతో కలసి పని చేస్తాడు.

ఆయన తన పెండ్లికుమార్తెతో ఎలా పనిచేస్తాడో నీవు చూస్తున్నావా? ధర్మశాస్త్రమువలె ఆయన కేవలము ఆజ్ఞలు మాత్రమే ఇవ్వడు గాని మనము ఆయన సహ పనివారము గనుక ఆయన మనలో పని చేస్తాడు
ఆ విధమైన భర్తగా ప్రభువైన యేసు మనకున్నారు.

రచయిత ✍️

జాక్ పూనెన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు