ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత


ఎఫెసీ 1:18లో మీ హృదయ (మనో) నేత్రములు తెరువబడునట్లు ప్రార్థిస్తున్నానని పౌలు చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధనలో హృదయానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. పాత నిబంధనలో కేవలం తెలివి గురించి చెప్పబడింది. కాని ఇప్పుడు దేవుని జీవపు వెలుగు మన హృదయములో ప్రవేశించాలి. పాత నిబంధనలో కొద్దిమంది మాత్రమే దేవుని హృదయాను సారులున్నారు. సామెతలలో హృదయం గురించి చాలా చెప్పబడింది. దావీదు దేవుని హృదయానుసారుడు. కాని సామాన్యముగా యాజకులు మరియు ధర్మశాస్త్ర బోధకులు హృదయానుసారులు కాదు. ప్రభువైన యేసును సిలువ వేసిన శాస్త్రులును మరియు పరిసయ్యులును తయారు చేయబడ్డారు.

నీవు లేఖనములను కేవలం అక్షరానుసారముగా చదివి, ధ్యానించి బైబిలును బాగా తెలుసుకున్నట్లయితే నీవు కూడా శాస్త్రిగా గాని లేక పరిసయ్యుడుగా గాని మారెదవు. దేవుని సత్యము నీ తలలో నుండి హృదయములోనికి దిగివచ్చినప్పుడు, ఆ సత్యమే నీకు ప్రత్యక్షత అవుతుంది. ఆ 12 అంగుళాలే ఎంతో వ్యత్యాసాన్ని తెస్తుంది. పౌలు ఈ విధంగా ప్రార్థించాడు, వారి మనోనేత్రములు వెలిగింపబడి ఈ విషయాలను చూడాలి.

  1. ఆయన మనలను పిలిచిన పిలుపు వలన మనము పొందిన నిరీక్షణ ఎంత గొప్పదో
  2. పరిశుద్ధులలో ఆయన ఉంచిన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో
  3. ఆయన క్రీస్తులో వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనలో ఆయన ఉంచిన తన శక్తియొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో అని మనము తెలుసుకోవాలి (ఎఫెసీ 1:17-19).

ఈ సత్యములను 25 సార్లు చదివి అర్థం చేసుకోమని పౌలు వారికి చెప్పలేదు. 100 సార్లు చదివి కూడా అర్థం చేసుకోక పోవచ్చును. వాటిని ప్రార్థనగా చేయుట ద్వారా ప్రత్యక్షత పొందుకుంటాము కాబట్టి పరిశుద్ధాత్మ నుండి ప్రత్యక్షత పొందుటకు పౌలు ప్రార్థించాడు. బైబిలులోని హెబ్రీ మరియు గ్రీకు పదముల అర్థమేమిటో నీవు చదివినప్పటికీ నీవు ఆత్మీయముగా గ్రుడ్డివాడవై యుండి మరియు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించక పోవచ్చును లేక మనము దేవునిచేత ఏర్పరచబడినట్లుగా ఆయన యెదుట పరిశుద్ధులమును, నిర్దోషులమును అవ్వలేక పోవచ్చును.

బైబిలు మీద పరిశుద్ధాత్మలో నుండి మనం ప్రత్యక్షత పొందినట్లయితే (ప్రార్థించుట ద్వారా) పరిస్థితులు వేరుగా ఉంటాయి. నీకు గ్రీకుబాష తెలియక పోవచ్చును గాని నీవు క్రీస్తును అనుభవపూర్వకముగా ఎరుగుదువు. నీవు క్రీస్తులో ఉంటావు. బైబిలులోని దేవుని వాగ్దానాలనే చెక్కులు పరలోకపు బ్యాంకులో నుండి పొందుకొని మరియు ఆత్మీయముగా ధనవంతుడవు అవుతావు. కాబట్టి ప్రత్యక్షత లేకుండా బైబిలును చదువుటకు ప్రయత్నించవద్దు.

పరిశుద్ధాత్మ నుండి ప్రత్యక్షత పొందుటకే బైబిలు చదవాలి. ఎవరైనా ప్రత్యక్షతకు కాకుండా బైబిలు జ్ఞానానికి నిన్ను నడిపించినట్లయితే నీవు తప్పిపోయెదవు. మనస్సును (మైండును) ఉపయోగించుటకు నేను వ్యతిరేకిని కాదు. బైబిలు చదువుటకు మరియు బోధించుటకు మైండును ఉపయోగిస్తాను. లేకపోతే నేను మీతో మాట్లాడలేను. అయితే నా మనస్సును పరిశుద్ధాత్మకు అప్పగించాను. మనకళ్ళ (శరీరము)తో బైబిలు చదువుతాము. ఆ మాటలు మన మనస్సు(ప్రాణము)లోనికి వస్తాయి. మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షతను పొందునట్లు ఆ మాటలు మన ఆత్మలోనికి చొచ్చుకుపోవాలి.

మూడు భాగాలున్న ప్రత్యక్ష గుడారములో ఒక ఉదాహరణ చూస్తాము. దేవుని వాక్యాన్ని చదువుటకుగాని లేక వినుటకుగాని మనము వినియోగించే శరీరము ఆవరణకు సాదృశ్యముగా ఉన్నది. వాక్యాన్ని మనం అర్థం చేసుకొని, స్పందించుటకు మనస్సును అనగా పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ప్రాణం రెండవది. మనం విధేయత చూపగలుగునట్లు, అతిపరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ఆత్మలోనికి వాక్యము వచ్చి, అక్కడ దేవునిలో నుండి ప్రత్యక్షతను పొందుకుంటాము. అటువంటి ప్రత్యక్షత వాక్యము ద్వారా దేవునిలో నుండి పొందుట ద్వారా దేవుని చిత్తమును నెరవేర్చగలము.

కాబట్టి దేవునిలో నుండి ప్రత్యక్షతను పొంది మరియు లోబడునట్లు మనం బైబిలు చదివి, ప్రార్థించాలి. మనం అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించునట్లు ప్రభువైన యేసు మనకొరకు మరణించి మరియు తెరను రెండుగా చీల్చాడు (హెబ్రీ 10:19,20). పరిసయ్యులు బైబిలు చదివి కూడా అర్థం చేసుకోలేక మరియు ప్రత్యక్షత పొందలేక పోవుట వలన ప్రభువై యేసును దయ్యముల అధిపతియైన బయెల్జెబూలన్నారు. పేతురు మాత్రం లేఖనములలోని ప్రత్యక్షతను పొంది మరియు ప్రభువైన యేసు సజీవుడైన దేవుని కుమారుడనియు మరియు మెస్సీయ్యా అనియు తెలుసుకున్నాడు.


రచయిత ✍️: జాక్ పూనెన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు