మత్తయి 8వ అధ్యాయములో ప్రభువైన యేసు చేసిన కొన్ని అద్భుతాల గురించి చదువుతాము. ఆయన బోధించుట మాత్రమేగాక ప్రజలగురించి జాగ్రత్త వహించారు. ఎవరూ ముట్టుకొనని కుష్టురోగులను ఆయన ముట్టుకొని యున్నారు. ఆయన వారిని స్వస్థపరచుటయే గాక వారికెంతో విలువనిచ్చారు.
ఒక రోమా శతాధిపతి ఎంతో దీనుడైయుండి మరియు విశ్వాసముతో నిండినవాడై, తన దాసుని స్వస్థపరచుటకు ప్రభువు తనయింటికి వస్తానని చెప్పినప్పటికీ, అతడు ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుగాను. నీవు మాటమాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అన్నాడు (మత్తయి 8:8). విశ్వాసము మరియు దీనత్వము రెండు కలసి వెళతాయి. వెంటనే ప్రభువైన యేసు ఇట్లన్నారు, ఇశ్రాయేలులో నేనెవనికైనను ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదు (మత్తయి 8:10). ప్రజలను మెచ్చుకొనుటలోను మరియు ప్రోత్సహించుటలోను ప్రభువైన యేసు ఎంతో ప్రవీణుడు (ఆరితేరినవాడు).
ఒకసారి అందరిలో ప్రభువు పేతురును ఇలా మెచ్చుకున్నాడు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచి యున్నాడు (మత్తయి 16:17).
ఆయన నతనయేలును ఇలాగున మెచ్చుకున్నాడు (ప్రశంసించాడు): ఇదిగో ఇతనియందు ఏకపటమునులేదు (యోహాను 1:47).
వారెవరు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ ప్రభువైన యేసు వారిని ఎంతో విస్తారంగా ప్రశంసించారు. రోమా శతాధిపతి, పేతురు మరియు నతనయేలు లోపములుగల అసంపూర్ణులు. కాని వారందరిలో ప్రశంసించుటకు ప్రభువు ఏదొకటి కనుగొన్నారు. రక్షణ పొందని వారిలోను, విగ్రహారాధికులలోను, శతాధిపతిలోను అనగా బైబిలునుగాని లేక నిజ దేవునిని గాని కొంచెం కూడా ఎరుగనివారిలోను మంచిని ప్రశంసించుటకు ఆయన వెనుదీయలేదు.
తన జీవితకాల మంతటిలో ఆ రోమా శతాధిపతి ప్రభువు తనతో అనిన మాటలను మరచి పోతాడను కొనుచున్నారా? మరచిపోడు. ఆ మాటలను బట్టి అతడు ఎంతో ప్రోత్సహించబడి, బహుశా ప్రభువైన యేసుకు ఒక శిష్యుడుగా మారియుండ వచ్చును. ఇక్కడ మనము నిజమైన భక్తిని మరియు పరలోక రాజ్యము గురించి కొంత నేర్చుకొనుచున్నాము. ఆదాము సంతానము ప్రజలను మెచ్చుకొనుటలో ఎంతో పిసినిగొట్టులుగా ఉండి మరియు తీర్పు తీర్చుటలో ఎంతో ప్రావీణ్యము కలిగియుంటారు. వారు ఉప్పొంగి పోతారేమోనని ఇతరులను మనం బహిరంగంగా మెచ్చుకొనము.
నిజముగా భయభక్తులుగల వారిని కూడా మనం మెచ్చుకొనలేము. ఈ అలవాటును చాలామంది విశ్వాసులు క్రీస్తులో నుండి నేర్చుకొనలేదు. సాతాను నుండి కలిగే ముఖస్తుతులు మనం చేయకూడదు. కాని నిజముగా యోగ్యమైన వారిని మెచ్చుకొనుట దేవుని లక్షణము. ఒక దైవజనుడు ఒక సహోదరుని మెచ్చుకొని నట్లయితే, అతడు ప్రభువైన యేసును వెంబడించుటకు ఎంతో ప్రోత్సహించ బడతాడు.
రచయిత ✍️
జాక్ పూనెన్

0 కామెంట్‌లు