రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
(మత్తయి 10:29-31)
“రెండు పిచ్చుకలు ఒక్క పైసాకు అమ్ముడుపోతాయి కదా? అయినా, మీ తండ్రి ఇష్టం లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలపై పడదు” (మత్తయి 10:29). యేసు ఇలా అన్నారు: "రెండు పిచ్చుకలు. ఆ రెండు పిచ్చుకల విలువ కేవలం ఒక్క పైసా". ప్రపంచంలో తొమ్మిది వేల రకాల పక్షులున్నాయి. కానీ, యేసు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అందరూ తక్కువగా గమనించే పిచ్చుకలనే ఎన్నుకున్నాడు.
దేవుడు ప్రతి పిచ్చుకను గమనిస్తాడు—ఈ పిచ్చుక ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తోంది, దానికి ఏమి కావాలి అని చూస్తాడు. చిన్న పిచ్చుక విషయములోనే దేవుడు ఇంత శ్రద్ధ చూపితే, అలాంటప్పుడు, నీ మీద ఆయన ఎంత శ్రద్ధ చూపుతాడో ఊహించు! నిన్ను చాలా సన్నిహితంగా, వ్యక్తిగతంగా, నీ గురించిన ప్రతి చిన్న విషయాన్ని బట్టి ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు.
బైబిల్‌లో ధైర్యం, శక్తి కోసం గద్దల గురించి, శాంతి, సంతృప్తి కోసం పావురాల గురించి చెప్పబడింది. కానీ నమ్మకం గురించి నేర్పడానికి దేవుని వాక్యం పిచ్చుకలను ఎన్నుకుంది. ఒక చిన్న పిచ్చుకకు ఏదైనా జరిగితే లేదా అది నేలపై పడితే, దేవుడు గమనిస్తాడు. అలాగే, చిన్న పిచుకల పైన కూడా శ్రద్ధ చూపిన ఆయన, తన స్వరక్తం ఇచ్చి కొనుకున్న నీ పట్ల మరింత శ్రద్ధ చూపుతాడని, నీ పూర్తి నమ్మకానికి, లోతైన విశ్వాసానికి ఆయన తగినవాడని నీకు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజు నీవు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు? బహుశా నీవు ఎవరూ పట్టించుకోని పిచ్చుకలా, మొత్తం దివాలా తీసిన వ్యక్తి తన పిచ్చుకకు ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్న వాని దగ్గర పెరుగుతున్న పిచ్చుకలా నిన్ను గూర్చి నీవు అనుకుంటున్నావేమో. కాసేపు ఆగు. మత్తయి 10:29లోని నిజాన్ని గుర్తుచేసుకో. దేవుడు నీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. . ఈ రోజు ఒక సాధారణ పిచ్చుకలా దేవుణ్ణి నమ్ము. ప్రశ్నలు అడగకు. ఆయన నిన్ను కాపాడడని భయపడకు. నీ గొప్ప దేవుని రక్షణలో, సంరక్షణలో నీవు విశ్రాంతి తీసుకో.
ప్రార్థన: తండ్రీ, ఈ విశ్వములో నీవు ఎన్నో విషయాలను చూసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఈ లోకం తక్కువవారిగా, లెక్కలేనివారిగా చూసే వారి గురించి నీకు హృదయం ఉండడం ఆశ్చర్యంగా ఉంది. నీవు నా జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని గమనించి, శ్రద్ధ తీసుకుంటావని నమ్మలేనందుకు నన్ను క్షమించు. ఈ రోజు చిన్న చిన్న విషయాల్లో నిన్ను నమ్మడానికి నాకు సహాయం చెయ్యండి. ప్రతి విషయాన్ని నీపై నమ్మకం ఉంచే అవకాశంగా చూడటానికి సహాయము చెయ్యండి. ఆమెన్. ~జోని ఎరెక్సన్ టాడా
0 కామెంట్‌లు