మలాకీ 1:2-5 2. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమచూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. 3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. 4. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. 5. కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందురు.
మలాకీ 1:2-5 వచనాలలో దేవుడు యాకోబును ఏర్పరచుకున్న సార్వభౌమ విధానమును గురించి ఆయన చెప్పెను. ''మీ పితరుడైన యాకోబును ప్రేమించుట ద్వారా నా ప్రేమను మీకు చూపించాను. ఏశావు యాకోబు అన్న అయినప్పటికి నేను ఏశావును తిరస్కరించి నిన్ను ఏర్పరచుకున్నాను''.
దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని మనకు ఎలా తెలుసు? మొట్టమొదటిగా మన పాపముల కొరకు మరణించడానికి ఆయన క్రీస్తును పంపించాడు. లోకములో ఉన్న కోట్లాదిమందిలో జీవమార్గమును కనుగొనుటకు ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఆయన మనలను ఎందుకు ఏర్పరచుకొనెను? మనము ఇతరుల కంటే నీతిమంతులమనా? కాదు. మనందరికి రక్షింపబడని బంధువులు, స్నేహితులున్నారు. మానవరీత్యా చూస్తే వారు మనకంటే మెరుగైన వారు. మనము పాపులమని మనము గుర్తించినందుకు దేవుడు మనలను అంగీకరించెను. యేసు నీతిమంతులను కాక పాపులను పిలచుటకు వచ్చెను. మనము దేవునిచేత మురికి కాలువ నుండి పైకెత్తిన పాపులము.
మన కొరకు దేవునికున్న ప్రేమకు ఈ ఋజువును మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విశ్వములో దేనిని సృష్టించక ముందు దేవుడు నీ పేరును జీవ గ్రంథములో వ్రాసెనని, లోకములో నున్న కోట్లాది మందిలో ఆయన నిన్ను ఏర్పరచుకొనెనన్న విషయాన్ని ఎప్పుడు మరువకుము. అది ఆయన సార్వభౌమ ఎంపిక. ''రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది'' (రోమా 9:11-13). దేవుడు మనలను ఎంచుకొనుటలో ఆయన సార్వభౌమత్వాన్ని మనము ఇక్కడ చూస్తాము. ఇది మంచి క్రియలకు సంబంధించిన విషయం కాదు. నీవు మొదట ప్రభువును ఎంచుకున్నావని నీవనుకుంటే, అది కూడా నిజము కాదు. ''మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను'' అని యోహాను 15:16లో యేసు చాలా స్పష్టముగా చెప్పెను. ఈ విషయం ఎప్పుడు మరువవద్దు.
0 కామెంట్‌లు