మలాకీ 1:2 ''నేను మీ యెడల ప్రేమచూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు.''
ప్రభువు ఇక్కడ తన ప్రజలపైన ఒక ఫిర్యాదు చేస్తున్నాడు: ''నేను మీ యెడల ప్రేమచూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు'' (1:2). మలాకీ ప్రవచనములో, ప్రభువు తన ప్రజలతో ఏదైనా చెప్పినప్పుడు వారు ఆయనను (ఇక్కడచేసినట్లే) ప్రశ్నించిరని మనము గమనిస్తాము. వారు ఆయనను ఏడు మార్లు ప్రశ్నించిరి.
ఇక్కడ వారు దేవుని ప్రేమను ప్రశ్నించిరి. సాతాను మనలను పడవేయుటకు అదొక మార్గము. సాతాను హవ్వను శోధించినప్పుడు, దేవుని ప్రేమ గురించి ఆమె మనస్సులో ఒక సందేహాన్ని నాటాడు. శోధన యొక్క భావము ఇదే: ''దేవుడు నిన్ను నిజంగా ప్రేమించుట లేదు. ప్రేమిస్తే ఈ అందమైన ఫలాన్ని తినడానికి అనుమతించే వాడు కదా?'' అది హవ్వను దేవుని ప్రేమను సందేహించునట్లు చేసెను. ''బహుశా దేవుడు నన్ను ప్రేమించుట లేదేమో'' అని ఆమె తలంచుట ప్రారంభించింది. అప్పుడు ఆమె తేలికగా పాపములో పడిపోయింది.
ప్రభువు పేతురు కొరకు ప్రార్థించినప్పుడు, ''సాతాను నిన్ను పట్టి గోధుమలవలె జల్లించుటకు కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని'' అని చెప్పెను (లూకా 22:31,32). పేతురు ప్రభువును యెరుగనని మూడు సార్లు బొంకి పాపము లోతులలో పడిన తరువాత కూడా దేవుడతనిని ప్రేమిస్తున్నాడని అతడు ఇంకా నమ్మునట్లు ప్రభువు ప్రార్థించెను. అదే విశ్వాసము - తప్పిపోయిన కుమారునికి ఉన్నది.
అతడు తన జీవితాన్ని పాడుచేసుకొని అన్నిటిని పోగొట్టుకున్న తరువాత కూడా తన తండ్రి తనను ప్రేమిస్తున్నాడన్న ఒక్క విషయాన్ని నమ్మాడు. నీవు కూడా నీ జీవితాన్ని పాడుచేసుకొని యుండవచ్చును. అయితే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకొనుము. ఆ వాస్తవాన్ని నమ్ముట ఎప్పుడూ మానకుము. నీవు లోకంలో సమస్తాన్ని పోగొట్టుకున్న తరువాత కూడా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడన్న మారని వాస్తవాన్ని విడిచిపెట్టకుము. ఇది జీవితములో గుర్తుంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము.
~ జాక్ పూనెన్ ~
0 కామెంట్‌లు